Tuesday, September 9, 2014

ఉచిత గుర్తింపు

ఎందుకో మళ్లీ ఏదో ఒకటి  వ్రాయాలనిపించింది ......
పక్కవాడు చేసిన పనికి మనం క్రెడిట్ కొట్టేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో  ఈరోజే తెలిసొచ్చింది(చాల రోజుల క్రిథమ్.ఎరొజు post చేస్తున్న).
మొన్న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా పెట్టిన online  quiz లో  పాల్గొన్నా ....అంటే అందులో మనం పెద్దాగా చేయాల్సినది లేదు .
వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలని  Google లో కొట్టి సమాధానాలు పంపించడం.మనకి అది కూడా బద్దకమే కదా . కాబట్టి పక్క colleague సెర్చ్ చేసిన వాటినే నేను పంపించ . టాప్ 5 లో తను ఫస్ట్ నేను సెకండ్ .
ఇంకేం గాల్లో తేలినట్టుందే గుండె పేలి నట్టుందే అని పాట మది లో మెదిలి గిఫ్ట్ కోసం నిరీక్షన . ఏంటి ఇంకెవరు  పంపించ లేదా అనుకుంటున్నారా .
జరిగిందేమిటంటే  ఈ ప్రస్నాలన్ని ఒక ఆన్లైన్ ఫోరం లో submit  చెయ్యాలి ,ఆ లింక్ మాకు ముందే దొరికింది ,అందుకే తను ఫస్ట్ అండ్ నేను సెకండ్.

Monday, July 27, 2009

చాలాకాలం తర్వాత

నిన్న నేను ఆరొహగ్య పరీక్ష ('Medical checkup' ) కి వెళ్లాను.నాకు ఇంతకు ముందు జరిగిన సంగటన గుర్తుకు వచ్చింది.నాకు అది మొదటి సారి రక్తం ఇవ్వడము,నర్సుని చూస్తే కొత్తగా చేరి నట్టుంది . నరుసు ఒక చెయ్యి చూసి తలాదడించి ఇన్కొ చెయ్యి చుపించమన్ది.అస్సలే భయన్గా ఉంటే రెండో చేతిని తీవ్రంగా చూసి సినిమా లో రోగి మరణించి నపుడు వైద్యుడి లాగా నిట్టూర్చి కష్టం అంది,అంతే నా ప్రాణాలు పైకి పూయాయనిపించింది , ఒక్కసారిగా నాకు వళ్ళంతా చమటలు పట్టేసాయి దాహం దాహం అన్టు గట్టిగా అరిచాను.ఒక గ్లాసు మంచి నీళ్లు ఇచ్చి మొదటి సారా అని అడిగింది,అవి తాగి గ్లాస్ చేతిలో పెడుతూ ఒక వచ్చి రాని నవ్వు నవ్వి ,నిజం చెప్పు నేనే ని మొదటి పేషెంట్ ని కదా అని అన్నామనసులో ఇంకా సూది తన చేతిలోనే ఉంది కనుక పైకి అనే ధైర్యం చెయ్యలేదు ...ఆ తరువాత నాచేతికి తాడు కట్టి ,రక రకల అనేక రకాలుగా చేతిని తిప్పి నా రక్తాన్ని నవ్వుతూ లాగేసి విజయగర్వం తో(మరి మొదటి సారి కదా) అయిపొయింది రెస్ట్ తీసుకొండి అంది.
ఈ రోజు క్లినిక్ కి వెళ్తుంటే ఇది గుర్తోచి భయం భయం గ వెళ్ళా .కాని ఒక వైపు మనసుకి కొంచెం ధైర్యం గానే ఉంది ,ఎందుకంటే నేను వెళ్ళేది కేరళ లో క్లినిక్ కి...(నర్సులు అందంగా ఉంటారనే కాదు ,నర్సింగ్ లో ఫేమస్ అని )
పేరుకు తగ్గట్టు గానే చక చకా రక్తం తీసేసి ఐపోయింది,వేరే టెస్ట్ కి పో అంది ...హమ్మయ అని X ray కి వెళ్ళా .అక్కడ ఒక పలక లాంటిది ఒకటి పెట్టి దానిమీద ఏదో అతికించినది.నా పేరు అనుకుంట ..పోలీస్ స్టేషన్ లో దొంగోడి మెళ్ళో పలక తగిలించి పేరు రాస్తారు అలా.నన్ను దాన్ని పట్టుకు ని నిలబదమంది..నేను మాములుగా పట్టుకునినుంచున్న ,ఆప్పుడు అలా కాదు ఇలా అని నన్ను గబ్బిలం లాగా ఆ పలకను పట్టుకోమంది .ఇదు నిమిషాలు అయ్యింది వెనక నుంచి ఎం వినిపించట్లేదు .నెమ్మదిగా వెనక్కితిరిగి చూస్తే తను అప్పుడే లోపల రూం లోనుంచి వస్తు ఇంకా దానికి అతుకున్నే వున్నావా X-Ray తీయడం ఐపోయింది గా అంది ..ఆ ముక్క ముందు చెప్పాలి అని మనసు లో అనుకుంటూ (ఇంకా ECG వుందిగా మరి )ఒక వెధవ మొహం పెట్టా ..
తరువాత నన్ను మంచం మీద పడుకోపెట్టి జేబు లో నాణాలు ఎమన్నా ఉన్నాయా అనడిగింది ..ఒక్క క్షణం అనుమానమొచ్చింది ఇది బెదిరింపు అని ..ఐనా మరీ రూపాయి నాణాలతో ఏమి చేసుకుంటుంది లే అని ..ఎందుకు? అని నెమ్మది గా అడిగా.అవి వుంటే ECG సరిగ్గా రాదు అంట..హమ్మయని మొత్తం పరుసు తీసి చేతి లో పెట్టా..
అంతే నా కాళ్ళకి ,చేతులకి ,ఛాతీ మీద ..ఏదో జిగురు లాంటి పదార్థం రాసింది .. కొంపదీసి నామీద poster లు గట్రా అతికించాడు కదా అని అనుకున్తుందాగానే ..ఏవో రక రకాల రంగుల్లో ఉన్నclip ల ని కాళ్ళకి ,చేతులకి తగిలించింది ..తర్వాతా చిన్న రబ్బరు తో చేసిన plug లాంటివి నా ఛాతీ మీద ముగ్గు వేసినట్టు అర్థచంద్రాకరం లో తగిలించింది ..మీకిది ఫస్ట్ టైం ఆ అని అడుగుదామని గొంతు దాక వచ్చి ఆగిపోయా ..
ఎందుకంటే అదేదో "లై detecter " పరీక్ష లాగా నా శరీరం మొత్తం వైర్ లు ఉన్నాయి ..తనకి గని తిక్కరేగి
ఏదో ఒక వైర్ ని తిన్నగా ప్లగ్ లో పెట్టిందంటే అంతే మన పని అని నోరు నొక్కేసుకున్న. తరువాత ECG ని ఒక సారి చూసా ..సినిమాలో చూసినట్టు అడ్డదిదంగా గీతలు ఉన్నాయి..హమ్మయ అనుకున్నా అందులో గీతలు తిన్నగా లేక పోవడం చూసి..ఆ విధంగా నా వైద్య పరీక్షలు ముగించుకుని బయట పడ్డా
నేను భయపడకుండా రక్తాన్ని ఇచ్చా అనే ఆనందంతో. ఎంతైనా కేరళ నర్సులు కేరళ నర్సులే ..:)

Tuesday, June 3, 2008

చందమామ చిన్నపిల్లల నేస్తం

నీను ఈ మధ్యనే చందమామ వెబ్సైట్ చూసాను.నాకు చాలా ఆనందం వేసింది.
చందమామ
ప్రస్తుతానికి ఇది తెలుగు ,తమిళ మరియు ఆంగ్ల భాషలలో వుంది.నాకు చిన్నతనం నుంచి చందమామ కథలు అంటే ఎంతో ఇష్టం.ప్రతి నెల చందమామ మొదటి తారీకున చదవాల్సిందే.నేను చందమామ చదివి నా తెలుగు మెరుగు పరచు కున్నాను.ఈ website లో 1947 నుండి వచ్చిన చందమామలు వున్నాయి.

Friday, February 2, 2007

ఇది నా మొదటి బ్లాగు

నమస్కారం

ఇది నా మొదటి బ్లాగు అందుకే ఏమి రాయాలో తోచక ఇది రస్తున్నాను.తరువాత నుంచి నాకు తొచినది
రాస్తాను.ప్రస్తుతానికి అంతే.

మరి సెలవ్
జయం